అమరావతి భూముల సిట్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. సిట్ ఏర్పాటు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుపై తదుపరి చర్యలు లేకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి భూముల విషయంలో గత ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ జగన్ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది.
ADVERTISEMENT
అయితే సిట్ ఏర్పాటును సవాల్ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ADVERTISEMENT