మతమార్పిడిలు చేసుకుంటే తప్పేంటి?

13

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ హోంశాఖ మంత్రి సుచరిత మండిపడ్డారు. పవన్ ఏ పార్టీతో ఉన్నారో ఆయనకే తెలియదని అన్నారు. మత మార్పిడులు చేసుకోవటం నేరమా అని ప్రశ్నించారు. ప్రజలు తమ ఇష్ట ప్రకారం మతమార్పిడులు చేసుకుంటే తప్పేంటని నిలదీశారు. దిశ హత్యాచారం కేసులో నిందితులకు వేగంగా శిక్ష పడాలనేది తమ అభిమతమని, 151 సీట్లు ఇచ్చి ప్రజలు తమకు అధికారాన్ని ఇచ్చారని అన్నారు.