బిగ్ బ్రేకింగ్ : బీజేపీ విష్ణు వర్ధన్ రెడ్డిని అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు
Timeline

బిగ్ బ్రేకింగ్ : బీజేపీ విష్ణు వర్ధన్ రెడ్డిని అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు

అమలాపురంలో అర్దరాత్రి అక్రమంగా పోలీసులు బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

గత కొన్ని రోజులుగా విష్ణు వర్ధన్ రెడ్డి ప్రభుత్వంపై చాలా ఘాటు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా గత కొన్ని రోజులుగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అయన తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా గట్టిగా డిమాండ్ కూడా చేస్తూ వచ్చారు.

అంతర్వేది నరసింహ స్వామి వారి రథం తగలబెట్టిన ఘటన భాజపా తీవ్రంగా పరిగానిస్తోంది, ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు, ప్రజాస్వామ్యం లో నిరశన తెలియచేయడం రాజకీయ పార్టీల హక్కు అని ఆయన అన్నారు, బిజెపి అధ్యక్షులు వీర్రాజు గారి గృహ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపిన ఆయన వీర్రాజు గారినిభేషరతుగా తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు, ప్రజా ఉద్యమాలు ఆపాలి అనుకోవడం రాష్ట్ర ప్రభుత్వ పిరికిపంద చర్యగా ఆయన పరిగణించారు. పలు రకాల సెక్షన్ లో రాష్ట్ర అద్యక్షులు సోము వీర్రాజుగారిని నిర్బందించడం బిజేపి మీద నేరుగా దాడిచేయడమేనని, రథం దగ్ధం కేసులో దోషులను అరెస్ట్ చేయడం మీ చేతకాలేదా అంటూ ఘాటుగా విమర్శించారు.

దుండగులను అరెస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని, రాష్ట్ర ప్రభుత్వం భక్తులు శిక్షిస్తుంది దుండగులు రక్షిస్తుందని, అంతర్వేది లో జరిగిన సంఘటనలో నిరసకారులను అరెస్ట్ చేస జైలుకు పంపుతారా మీ ప్రభుత్వంలో అంటూ విమర్శించారు.

రేపు అమలాపురం లో జరిగే కార్య క్రమాన్ని వందలాది మంది నాయకులను , కార్యకర్తలను గృహ నిర్బంధలో వుంచి ఉద్యమాన్ని అనచాలనే ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తక్షణమే మానుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఇలా ప్రజా వ్యతిరేక పోకడలకు పోయినందుకేజ్ ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పారో చూడలేదా అంటూ 2019 ఎన్నికల గురించి గుర్తుచేశారు. మెజారిటీ హిందువులు ఉన్న రాష్ట్రంలో వారి భావాలను కించ పరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుదని ఇది సహించలేని వైఖరి అని విష్ణువర్ధన్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

https://www.youtube.com/watch?v=7uDdWIfDzGY