2017-2018 : ఏపీ, దేశంలో అతి తక్కువ అక్షరాస్యత

దేశంలో అతి తక్కువ అక్షరాస్యత నమోదు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ చెత్త రికార్డును నమోదు చేసింది. విద్యా రంగానికి సంబంధించి నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) తాజా నివేదిక విడుదల చేసింది.2017-18 సంవత్సరానికి చెందిన డేటా ఇది.

ఏడు సంవత్సరాల దాటిన వారి విద్యార్హతల ఆధారంగా ఈ నివేదిక తయారు చేశారు. ఈ జాబితా ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 66.4 శాతం అక్షరాస్యతతో ఏపీ అట్టడుగున ఉంది. 96.2 శాతం అక్షరాస్యతతో కేరళ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. పురుషులు, మహిళ అక్షరాస్యత మధ్య తేడా కూడా ఈ రాష్ట్రంలో కేవలం 2.2 శాతం మాత్రమే.

అదే ఏపీలో ఈ వ్యత్యాసం 13.9 శాతం కాగా, రాజస్థాన్‌లో 23.2 శాతం, బీహార్‌లో 19.2, యూపీలో 18.4 శాతం. బీహార్‌లో అక్షరాస్యత 70.9 శాం కాగా, తెలంగాణ 72.8 శాతం… చిత్రమేమిటంటే ఈ రాష్ట్రాలన్నింటిలో అక్షరాస్యత జాతీయ సగటు కన్నా తక్కువ ఉండటం విశేషం. జాతీయ సగటుఉ అక్షరాస్యత 77.7 శాతం.