ఏపీ | కొత్త కరోనా వచ్చిన మహిళ.. ఢిల్లీ నుండి పరార్
Timeline

ఏపీ | కొత్త కరోనా వచ్చిన మహిళ.. ఢిల్లీ నుండి పరార్

రాజమహేంద్రవరం రూరల్‌ మండలం హుక్కుంపేట సమీపంలోని రామకృష్ణనగర్‌కు చెందిన ఆంగ్లో ఇండియన్‌ మహిళ ఒకరు ఈనెల 22న యూకే నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఆమెను రిసీవ్‌ చేసుకునేందుకు ఆమె కుమారుడు ఢిల్లీ వెళ్లారు. యూకేలో కరోనా పరీక్షలు చేయించుకున్నా అక్కడ ఫలితాలు రాకుండానే ఆమె బయలుదేరి భారత్‌కు వచ్చినట్టు తెలిసింది. స్వదేశంలో కూడా ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్షలు చేశారు. ఫలితాలు వచ్చేవరకు ఆమె అక్కడే క్వారంటైన్‌లో ఉండాల్సి ఉండగా, అక్కడ నుంచి పరారై రాజమహేంద్రవరం రావడానికి బయలుదేరారు. ఆమె ఢిల్లీ నిజాముద్దీన్‌ ట్రైన్‌ ఎక్కినట్టు పసిగట్టిన పోలీసులు ధ్రువీకరించుకున్నారు. అర్ధరాత్రి ఆమె రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు చేరుకోనుంది. ఆమె ట్రైన్‌ దిగిన వెంటనే ఆసుపత్రికి తరలించాలా, హోం క్వారంటైన్‌లో ఉంచాలా అనే తర్జనభర్జన కొద్దిసేపు జరిగింది.

తొలుత కొత్త కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించి ఢిల్లీ వైద్యాధికారులు వెంటనే ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించినట్టు తెలిసింది. అయితే బాధితురాలి ఫోను, ఆమె కుమారుడు ఫోను స్విచ్‌ ఆప్‌లో ఉండడంతో ప్రభుత్వ అధికారులు భయాందోళన చెం దారు. ఆమె పాస్‌పోర్టు ఆధారంగా అడ్రస్‌ను గుర్తించారు.  వెంటనే స్పందించిన ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆమెను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. రాజమహేంద్రవరం అర్బన్‌ పోలీసులను, వైద్య విభాగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆమె ఆచూకీ తెలిసిన తర్వాత రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్‌కు తరలించాలని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారం మొత్తం గోప్యంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published.