అర్ణబ్ గోస్వామి మెగా న్యూస్ : అన్ని రాష్ట్రాల్లో – అన్ని భాషల్లో రిపబ్లిక్ టీవీ లాంచ్
Timeline

అర్ణబ్ గోస్వామి మెగా న్యూస్ : అన్ని రాష్ట్రాల్లో – అన్ని భాషల్లో రిపబ్లిక్ టీవీ లాంచ్

ప్రతి భాషలో రిపబ్లిక్ ఛానెళ్లను ప్రారంభిస్తాను అని, అంతర్జాతీయ మీడియాలో కూడా రిపబ్లిక్ పాత్ర పోషించబోతుందని తెలిపారు.

సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన గంటల తరువాత రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామి తన అరెస్టు అయిన 8 రోజుల తరువాత తలోజా జైలు నుండి రిలీజ్ అయ్యారు. ఆ తరువాత బుధవారం రాత్రి, అర్నబ్ రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ యొక్క లోయర్ పరేల్ స్టూడియోకి వెళ్లారు. ఆట ఇప్పుడే మొదలయిందని అయన తన బృందంతో చూపినట్టు రిపబ్లిక్ పేర్కొంది.

తన టీమ్ తో మాట్లాడుతూ అర్ణబ్ , అతి త్వరలో, రానున్న 11 , 12 నెలల్లో ప్రతీ భాషలో ప్రతీ రాష్ట్రంలో రిపబ్లిక్ టీవీ నెట్వర్క్ రాబోతుందని చెప్పారు. అవసరం అయితే జైలు నుండి కూడా నేను టీవీ లాంచ్ చేయగలను అని ఆయన పేర్కొన్నారు. మరో రెందు సంవత్సరాల్లో రిపబ్లిక్ టీవీ ఇంటర్నేషనల్ మీడియా ప్రాజెక్ట్ కూడా మొదలవుతుందని చెప్పారు

Source :

https://www.republicworld.com/india-news/general-news/arnab-goswamis-mega-announcement-republic-channels-in-every-state-global-media-project.html