ఒక వింతైన క్రైమ్ న్యూస్.. ఏనుగులను హత్య చేసిన కేసులో రైలు ఇంజన్ సీజ్
Timeline

ఒక వింతైన క్రైమ్ న్యూస్.. ఏనుగులను హత్య చేసిన కేసులో రైలు ఇంజన్ సీజ్

బహుశా భారత రైల్వే చరిత్రలో ఇదొక ఘట్టం. ఇప్పటి వరకు మనుషుల పై పోలీస్ కేసు పెట్టడం , చెట్లు తిన్నాయని జంతువులకు ఫైన్లు వేయడం చూసి ఉంటారు వార్తలు చదివి ఉంటారు. కానీ మొట్ట మొదటి సరిగా ఏనుగులను హత్య చేస్తున్నాయి అంటూ ఒక రైలు ఇంజన్ ను దోషిగా తేల్చి సీజ్ చేయడం బహుశా ఇదే మొదటి సారెమో

ఈ సంఘటన అస్సాం రాష్ట్రలో జరిగింది. వివరాల్లోకి వెళితే , గూడ్స్ రైలు వెళ్తుండగా ఏనుగు, దాని పిల్ల పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు చాలా వేగంగా వచ్చి వాటిని గుద్దడంతో తల్లి ఏనుగు అక్కడికక్కడే చనిపోగా పిల్ల ఏనుగు కిలోమీటర్ వరకూ రైలు ఇంజిన్ కిందే పడిపోయింది. ఈ ఘటనలో రైలు పైలట్, కోపైలట్ ఇద్దర్నీ… రైల్వే శాఖ సస్పెండ్ చేసి విదులనుండి తొలగించింది.

వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఏనుగు షెడ్యూల్ 1 వన్యప్రాణి. రిజర్వ్ ఫారెస్టులో వెళ్లేటప్పుడు రైళ్లు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి. కానీ ప్రమాదం జరిగినప్పుడు రైలు వేగం గంటకు 60 కిలోమీటర్లు ఉందని రైల్వే అధికారుల దర్యాప్తులో తేలింది” అని రాజీవ్ దాస్ తెలిపారు.

పోలీసులు కత్తులు, పిస్టళ్లను ఎలాగైతే సీజ్ చేస్తారో… అలా మేం రైలు ఇంజిన్ ని సీజ్ చేశాం. ఎందుకంటే ఈ ఘటనతో రైలు ఇంజిన్ కి కూడా సంబంధం ఉంది.” అని దాస్ తెలిపారు.