Breaking News :

బాబోయ్..అది భూమిని గుద్దితే ప్రమాదం తప్పదంటున్న నాసా

భారీ గ్ర‌హ‌శ‌క‌లం భూమికి స‌మీపంగా వెళ్ల‌నున్న‌ది. బాక్సింగ్ డే రోజున ఆ గ్ర‌హ‌శ‌క‌లం భూ క‌క్ష్య‌కు ద‌గ్గ‌ర నుంచి వెళ్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. భూమికి స‌మీపంగా వెళ్తున్న ఆ ఆస్ట‌రాయిడ్‌ను 2000 సీహెచ్‌59గా గుర్తించారు. ఆ గ్ర‌హ‌శ‌క‌లం సుమారు 2034 ఫీట్ల వెడ‌ల్పు ఉన్న‌ది. సుమారు 27 వేల మైళ్ల వేగంతో ఆ అంత‌రిక్ష రాయి ప్ర‌యాణిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 

ఇది ఎంత వేగంతో వెళ్తోందంటే.. ఎఫ్‌-16 యుద్ధ విమానాల క‌న్నా 18 రేట్ల వేగంతో ఆ గ్ర‌హ‌శ‌క‌లం ప్ర‌యాణిస్తుంది. డిసెంబ‌ర్ 26వ తేదీన ఉద‌యం 7.54 నిమిషాల‌కు ఈ ఆస్ట‌రాయిడ్ భూ క‌క్ష్య‌కు స‌మీపం నుంచి వెళ్ల‌నున్న‌ది. అయితే క్రిస్మ‌స్‌, బాక్సిండే రోజు సెల‌వుల‌కు ఎటువంటి ప్ర‌మాదం లేద‌ని సైంటిస్టులు చ‌మ‌త్క‌రించారు.

సీహెచ్59 ఆస్ట‌రాయిడ్ భూమికి దాదాపు 45 ల‌క్ష‌ల మైళ్ల దూరం నుంచి ప్ర‌యాణిస్తుంది. అంటే చంద్రుడికి 19 రేట్లు ఎక్కువ దూరం నుంచి ఆ ఆస్ట‌రాయిడ్ వెళ్తుంద‌ని నాసాకు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ నియ‌ర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్ట‌డీస్ పేర్కొన్న‌ది. వాస్త‌వానికి సీహెచ్‌59 ఆస్ట‌రాయిడ్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన గ్ర‌హ‌శ‌క‌లం.

కానీ దాని వ‌ల్ల మాత్రం ప్ర‌స్తుతం ఎటువంటి ముప్పులేద‌ని నాసా శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. అది ప్ర‌యాణిస్తూ మార్గాన్ని గ‌మ‌నిస్తే, క‌నీసం మ‌రో వందేళ్ల వ‌ర‌కు కూడా ఆ గ్ర‌హ‌శ‌క‌లంతో భూమికి ఎటువంటి ప్ర‌మాదం లేద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. 

నాసాకు చెందిన సీఎన్ఈవోఎస్ సంస్థ దాదాపు 25వేల గ్ర‌హ‌శ‌క‌లాల‌ను ట్రాక్ చేస్తున్న‌ది. ఇవ‌న్నీ క‌నీసం 460 ఫీట్ల వెడ‌ల్పుతో ఉన్న‌వి. అయితే భూమికి స‌మీపంగా ప్ర‌యాణిస్తున్న ఆబ్జెక్ట్స్‌లో కేవ‌లం 35 శాతం మాత్ర‌మే ప్ర‌మాద‌క‌ర‌మైన‌వ‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. 

Read Previous

కొంపతీసి ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నారా?

Read Next

ఇదే సూర్య గ్రహణం ఫోటో …