మన దేశంలో కరోనా టెస్టులు చేయడమే బరువైపోయింది మన ప్రభుత్వాలకు. అసలు టెస్టులు చేయమని క్యూలో నిల్చున్నా కనికరం లేకుండా పోయింది.
టెస్టులు చేయించుకోమని ఆ దేశం ప్రజల వెంట పడుతుంది. అది ఏ దేశమో కాదు ఆస్ట్రేలియా. టెస్టులు చేయడమే కాదు , కరోనా పరీక్ష చేయించుకుంటే ప్రభుత్వమే డబ్బిస్తుందట.
పరీక్ష జరిగిన వెంటనే వ్యక్తి ఖాతాలో రూ. 15 వేలు జమవుతాయి. ఒకవేళ ఆ వ్యక్తికి ‘పాజిటివ్’ వస్తే రూ. 75 వేల ను ఆ వ్యక్తి ఖాతాలో జమచేస్తుంది. కరోనా పరీక్షలను ప్రోత్సహించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టింది.
అయితే కరోనా సమయంలోనూ ఉద్యోగం చేస్తున్న పౌరులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.