వంశీపై అయ్యప్ప భక్తుల ఆగ్రహం

23

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ అలజడి మొదలైన విషయం విదితమే. దీనికి కారణం టీడీపీ నాయకుడు వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేయడమే. అయితే పార్టీకి రాజీనామా చేయడంతోనే అసలు రాజకీయ మొదలైంది. తాను వైసీపీ కి మద్దతు ఇస్తున్నట్టు తెలుపడంతో, పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలు ప్రెస్ మీట్ పెట్టి మరీ వంశీ వివరించాడు.

పార్టీ నుండి బయటకు రావడానికి ముఖ్య కారణం చంద్రబాబు కుమారుడు చినబాబే అని, తనపై లేని పోనీ వ్యతిరేక వార్తలు పచ్చ మీడియాలోనే కాకుండా , తాను సీక్రెట్ గా నడిపిస్తున్న సొంత వెబ్సైట్లలో కూడా రాయించాడని, అడిగితే సంబంధం లేదని చెప్పడంతో మనస్థాపం చెందడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు. అంతే కాకుండా నిన్ననే అధికారం లోకి వచ్చిన వైసీపీ పై ఈ కుట్రపూరిత దీక్షలు ఏంటని, ప్రజల్లో టీడీపీ విశ్వాసం కోల్పోయిందని విమర్శించాడు.

అయితే ప్రెస్ మీట్లలో, మరియు టీవీ డిబేట్లలో కాస్త హద్దు దాటి , ఘాటుగా విమర్శలు చేస్తూ, అసభ్య పదజాలంతో టీడీపీ నాయకులను వ్యక్తిగత విమర్శలు చేయడంతో వంశీ ఇపుడు కాస్త ఇబ్బందుల్లో పడిపోయాడు. మాములుగా అయితే ఎవరు పట్టించుకోరు కానీ, అయ్యప్ప మాల ధరించి ఉండి ఇలాంటి సంభాషణ సరి కాదంటూ అందరు వంశీకి సలహాలు ఇస్తున్నారు.

దీనిపై అయ్యప్ప భక్తుల సంఘం ఆగ్రహం వెలిబుచ్చింది. వంశీ పద్ధతులు మార్చుకోవాలని నోటీసులు జారీ చేసింది.

Image