Breaking News :

డల్ అయిన బాబా.. ఒత్తిడి చేస్తుంది ఎవరు?

బిగ్‌బాస్‌ ఇంట్లో పదివారాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఇంటిసభ్యుల్లో కొంతమంది ఓ పట్టాన అర్థం కావట్లేదు. అందులో ముందు వరుసలో ఉండే వ్యక్తి బాబా భాస్కర్‌. ఇప్పటికే చాలాసార్లు బాబా ‘మాస్కర్‌’ అన్న నాగార్జున తాజా ఎపిసోడ్‌లోనూ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ‘ఆడాలని లేదు, వెళ్లిపోతాను’ అంటూనే ఎవర్ని పంపించాలో బాబా ప్లాన్‌ చేశాడు. తీరా ప్లాన్‌ వీడియోను వీకెండ్‌లో నాగార్జున అందరిముందు చూపించడంతో బాబా గుట్టు రట్టయింది.

పేరుకి పదిహేను మందిని హౌస్‌లోకి పంపిస్తారు కానీ మొదటి నాలుగైదు వారాలలో ఎవరిని బయటకి పంపేయాలనేది బిగ్‌బాస్‌ టీమ్‌ ముందే డిసైడ్‌ చేసుకుంటుంది. అలా ఈ సీజన్‌ నాన్‌-ప్రీమియమ్‌ కంటెస్టెంట్స్‌లో కొరియోగ్రాఫర్‌ బాబా భాస్కర్‌ ఒకడు. ఇంకా హౌస్‌లో మిగిలి వున్న వాళ్లలో మహేష్‌ విట్టా, శివజ్యోతి కూడా నాన్‌-ప్రీమియం కంటెస్టెంట్స్‌ అయినా కానీ వారి వల్ల బిగ్‌బాస్‌ టీమ్‌కి ఎలాంటి నష్టం లేదు.

ఇవాళ కాదంటే రేపయినా వాళ్లు ఎలిమినేట్‌ అయిపోతారు. కానీ ఎటొచ్చీ బాబా భాస్కరే వారికి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. మంచి వినోదాన్ని పంచుతూ, అనునిత్యం జోకులు వేస్తూ సరదాగా వుండే మాస్టర్‌కి బయట ఫాలోయింగ్‌ బాగా వుంది. దాంతో అతడిని ఎలిమినేట్‌ చేయడం బిగ్‌బాస్‌ వల్ల కావడం లేదు. దీంతో ప్రతి వారాంతంలోను హోస్ట్‌ నాగార్జునతో బాబాని ఫేక్‌, మాస్క్‌ వేసుకుని ఆడుతున్నాడంటూ చెప్పిస్తున్నారు. ఇప్పటికే అది బాబా ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గతంలో కంటే బాగా డల్‌ అయ్యాడు. మరింత ఒత్తిడి పెంచడానికి వ్యూహాత్మకంగా అలీ రెజాని మళ్లీ లోపలకి పంపించారు.

అతను తిరిగొచ్చింది లగాయతు మాస్టర్‌పై విషం చిమ్ముతున్నాడు. గతంలో బాబా అంటే చాలా ఇష్టంగా మసలుకున్న అలీ అలా వుండడం బాబా సహించలేకపోతున్నాడు. తాను మామూలుగానే వున్నా యాక్ట్‌ చేస్తున్నా అని ఎందుకంటున్నారనేది అతనికి అర్థం కావట్లేదు. అలీ రెజా హౌస్‌లోని అందరికీ బాబా మీద లేనిపోనివి చెబుతున్నాడు.

ఒక్క రోజు సీక్రెట్‌ రూమ్‌లో వున్న రాహుల్‌కి కూడా అదే ఫీడ్‌ చేసి పంపించారు. ఇలా ఫైనల్స్‌లోకి రాకుండా బాబాని ఎలిమినేట్‌ చేయడం, లేదా ఫైనల్స్‌కి ముందే తనంతట తానుగా వెళ్లిపోతానని బాబా చేతే చెప్పించడం బిగ్‌బాస్‌ వ్యూహమని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే రెండు వారాలలో ఏదో ఒక వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ టైమ్‌లో బాబా కనుక సెకండ్‌ లాస్ట్‌ పొజిషన్‌లో దొరికితే అప్పుడే డబుల్‌ ఎలిమినేషన్‌ చేసేస్తారు!

Read Previous

విశాఖ తొలి టెస్ట్: వరుణుడి ఆధిపత్యం ఉంటే అవకాశం

Read Next

తెలంగాణ బీజేపీ: నిధులు వస్తున్నా.. ప్రచారం నిల్