Breaking : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ ‌రెడ్డికి బెయిల్

34

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ ‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. సొంత పూచికత్తుతో ఎమ్మెల్యేతో పాటు శ్రీకాంత్ రెడ్డికి మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరు కాగానే వారిద్దరు రూరల్ వైసీపీ కార్యాలయానికి వెళ్లారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి చేసి బీభత్సం చేశారన్న ఆరోపణలపై ఆయన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 290, 506, 448, 427 సెక్షన్ల కింద కోటంరెడ్డితో పాటు ఆయన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు.

వెంకటాచలం మండలంలోని గొలగమూడి పంచాయితీలో కృష్ణారెడ్డికి సంబంధించి లే అవుట్​ ఉందని, దానికి సంబంధించిన అనుమతుల విషయంలో తనపై దాడి జరిగిందని ఎంపీడీవో సరళ వివరించారు. అయితే ఈ ఘటనపై ఆరా తీసిన జగన్‌.. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ నుంచి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని.. అందరూ సమానులే అని.. జగన్ అన్నట్లు తెలుస్తోంది. చట్టాన్ని ధిక్కరించే వారెవరైనా ఉపేక్షించొద్దని.. జగన్‌ స్పష్టం చేశారు. దీంతో పోలీసులు కోటంరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని అరెస్ట్‌ చేశారు.