హైదరాబాద్ వరద బాధితుల కోసం బాలయ్య భారీ విరాళం
Timeline

హైదరాబాద్ వరద బాధితుల కోసం బాలయ్య భారీ విరాళం

హైదరాబాద్‌ వరద బాధితులను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించి మరోసారి బాలయ్య తన గొప్ప మనసును చాటుకున్నారు.

హైదరాబాద్‌ మహానగరాన్ని కొన్ని రోజులుగా వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వరదలు రావడంతో హైదరాబాద్‌లోని కాలనీల వాసులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

అలాంటి వారందరినీ ఆదుకునేందుకు ముందుకు వచ్చిన బాలయ్య రూ. కోటి 50 లక్షలను విరాళంగా ప్రకటించారు. అంతేకాదు పాతబస్తీలో బసవతారక రామా సేవసమితి ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు బిర్యానీ ప్యాకెట్స్ అందేలా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది.