గోదావరిఖని ప్రాంతానికి చెందిన దాసరి శివాజీ అనాథ. అతడు ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్సకు డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడని బసవతారకం ఆస్పత్రి యాజమాన్యానికి తెలిసింది. డాక్టర్‌ టీఎస్‌ రావు, డాక్టర్‌ పట్నాయక్‌ల వైద్య బృందం శివాజీకి శస్త్రచికిత్స చేసింది. అతడు కోలుకునే వరకు అన్ని సేవలను ఉచితంగా అందించారు. శివాజీకి విజయవంతంగా చికిత్సను అందించిన వైద్యులు, సిబ్బంది కృషిని బాలకృష్ణ అభినందించారు. 

ఎంతో మంది పేద రోగులకు ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందించామని, భవిష్యత్తులోనూ ఇదేవిధంగా సేవలందిస్తామని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ తెలిపారు. కేన్సర్‌ సోకిన పేద యువకుడికి ఉచిత చికిత్సను అందించి నయం చేశామని చెప్పారు. ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.