Breaking News :

TV5 ఇంటర్వ్యూలో బాలయ్య మళ్ళీ గెలికేసాడు…

తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలకు తనను పిలవకపోవడాన్ని తప్పు పడుతూ బాలకృష్ణ 
ఇండస్ట్రీ పెద్దలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం దుమారాన్ని రేపాయి. భూములు పంచుకోవడం కోసమే ఈ మీటింగ్‌లు అంటూ బాలయ్య ఫైర్ కావడంతో కౌంటర్‌గా నాగబాబు రియాక్ట్ అయ్యారు. వెంటనే బాలయ్య క్షమాపణ చెప్పాలని లేదంటే చూస్తూ ఊరుకోం అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం నడించింది. ఇండస్ట్రీలోనూ రెండు వర్గాలు ఏర్పడి ఎవరి వాదనను వారు వినిపించారు.

అయితే ఈ గొడవ అక్కడితో ఆగిపోతుంది అని అందరు అనుకున్నారు. నిన్న బీబీసీ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో నాగబాబు కూడా ఆ విషయం అక్కడితో అయిపోయింది. బాలయ్య ఏదో ఆవేశంలో అలా అని ఉంటారు అంతే అంటూ పాజిటివ్ గా క్లోజ్ చేసారు. కానీ బాలయ్య 60 వ పుట్టిన రోజు రాబోతున్న సందర్భంగా తెలుగు టీవీ చానళ్లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు బాలయ్య.

నిన్న TV5 కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో యాంకర్ మూర్తి ఇండస్ట్రీ వారిపై ఆయన చేసిన కామెంట్లపై వివరణ అడగగా, మళ్ళీ ఏవ్ మాటలు రిపీట్ చేసారు బాలయ్య. ఈ సరి డోస్ పెంచారు. ఘాటుగా విమర్శలు చేసారు.

ఇండస్ట్రీ పెద్దలు కావాలనే ఆయనను పక్కన పెట్టారని, స్వార్ధం తోనే ప్రభుత్వాల దగ్గరకు వెళ్లి వాళ్ళ స్టూడియోలు కట్టుకోడానికి కాకా పడుతున్నారని అన్నారు. ఇండస్ట్రీ ని ఆడుకోడానికి నేను ముందుంటాను. నన్ను పిలవకపోయినా పర్లేదు కానీ ఇండస్ట్రీ కోసం నిజంగా పాటుపడితే చాలు అన్నారు.

అంతే కాదు ఆ ఇంటర్వ్యూ లో ఆర్టిస్టు పిలిచాడు నన్ను అంటూ ఆర్టిస్ట్.. ఆర్టిస్ట్ అంటూ నొక్కి మరీ ఎవరినో టార్గెట్ చేస్తూ చెప్పారు బాలయ్య.

Read Previous

Fact Check: మధు సూధన్ మరణం వెనక నిజాలు: భర్త చనిపోయాడని భార్యకు ముందే తెలుసా?

Read Next

కరోనాతో తెలుగు జర్నలిస్టు మృతి.. కన్నీళ్లు పెట్టించే కథ, గొప్ప వ్యక్తిత్వం మనోజ్ సొంతం