ఈటల ఎం తప్పు చేశారని.. టీఆర్ఎస్ మోసం చేసింది?
Politics Timeline

ఈటల ఎం తప్పు చేశారని.. టీఆర్ఎస్ మోసం చేసింది?

దేశంలో 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు    పూర్తయాయ్యాయని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఇక హుజురాబాద్ లో టిఆర్ఎస్ నేతలు భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని బండి ఆరోపించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై దాడికి ప్రయత్నించారని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ దాడులను తిప్పికొడుదాం. ఈటెల రాజేందర్ ఏం తప్పు చేశారు..? ఆయనను టిఆర్ఎస్ ఎందుకు మోసం చేసింది..? అని బండి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఈటెల కీలక పాత్ర పోషించారు.దళిత బంధు పథకాన్ని బిజెపి ఆపలేదని, జిహెచ్ఎంసి ఎన్నికల్లో.. బిజెపి సత్తా చూపిందని.. అదే ఫలితం హుజరాబాద్ లో రిపీట్ కాబోతోందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.