Breaking News :

గాయపడిన క్రికెటర్లకు ప్రధాని ఫోన్

భారత్‌తో జరుగుతున్న పింక్‌ టెస్టులో బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మెన్‌ లిటన్‌ దాస్‌, నయిం హసన్‌ గాయపడిన విషయం తెలిసిందే. ప్రథమ చికిత్స అనంతరం వెంటనే వీరిద్దరిని కోల్‌కతాలోని వుడ్‌లాండ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. లిటన్‌కు సీటీ స్కాన్‌ నిర్వహించగా.. నయింకు ఎమ్మారై స్కాన్‌ చేశారు. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎవరికీ పుర్రెకు గాని, తలకు గాయం కాలేదని వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం క్రికెటర్లను డిశ్చార్జ్‌ చేసినట్లు ఆస్పత్రి సీఈవో రూపాలి బసు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆమె వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

బంగ్లా ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ షమీ బౌన్సర్లు వీరిద్దరి హెల్మెట్‌కు బలంగా తాకడంతో క్రికెటర్లిద్దరూ మైదానం వీడారు. వీరి స్థానంలో కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌లుగా మోహదీ హసన్‌, తైజుల్‌లను తుది జట్టుకు వచ్చారు. దాస్‌ పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్‌ కాబట్టి ఐసీసీ నిబంధనల ప్రకారం హసన్‌ బ్యాటింగ్‌ మాత్రమే చేశారు. అతను బౌలింగ్‌ చేయడానికి వీల్లేదు. ఆఫ్‌ స్పిన్నర్‌ నయిం స్థానంలో మరో ఆఫ్‌ స్పిన్నర్‌ తైజుల్‌ బౌలింగ్‌కు దిగి ఎనిమిది ఓవర్లు వేశాడు.

Read Previous

జగన్ని చూసి భయపడుతున్న ఇన్వెస్టర్లు

Read Next

బీసీలను ఆదుకునేందుకు త్వరలో జగన్ జీవో