నేటి నుంచి.. ఒకే సమయం

11

అక్టోబరు 1 (మంగళవారం) నుంచి బ్యాంకుల వేళలు మారనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఇకపై ఒకేరకమైన సమయ పాలనను పాటించనున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2.00-2.30 గంటల మధ్య బ్యాంకు ఉద్యోగులకు భోజన విరామం ఉంటుంది. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీలో సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో.. ప్రతి ఆదివారం, రెండు, నాలుగు శనివారాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.