బెల్లంకొండ పై కందిరీగ కన్ను

34

అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. కానీ మంచి సక్సెస్ రావడానికి మాత్రం చాలా టైం పట్టింది. తాజాగా తమిళ్ సినిమా అయిన రాక్షసన్ ని తెలుగులో రాక్షసుడు అనే పేరుతో రిలీజ్ చేసి మంచి హిట్టు అందుకున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు శ్రీనివాస్ … ఈ నేపధ్యంలోనే కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథకి ఒకే చెప్పాడు. పక్కా మాస్ మరియు కామెడితో కూడుకున్న స్టొరీతో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాల్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.