Breaking News :

బెల్లంపల్లి మాజీ మున్సిపల్ కౌన్సిలర్, టీఆర్ఎస్ లీడర్ యూసఫ్ మృతి

బెల్లంపల్లి నియోజకవర్గం:

మన పట్టణ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ప్రస్తుత 4 వ వార్డ్ కౌన్సిలర్ ఆస్మా షేక్ గారి భర్త యూసఫ్ షేక్ గారు సాయంత్రం 7:30 గంటలకు గుండె పోటు తో మాంచేరియల్ లోని హెల్త్ కేర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

మున్సీపాల్ చైర్మన్ జక్కుల శ్వేతా శ్రీధర్ గారు మాట్లాడుతూ పట్టనం లో ఒక అనుభవంతులైన నాయకుడిని ప్రజా సేవకుడిని కోల్పోవటం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు,
అలాగే యూసఫ్ షేక్ గారికి ప్రగాఢమైన సంతాపం తెలిపి వారి ఆత్మ శాంతి కలగాలని కోరారు.

బెల్లంపల్లి రాజకీయంలో యూసఫ్ ది కీలక పాత్ర అనే చెప్పాలి. కాంగ్రెస్ లో తన ప్రస్థానం మొదలుపెట్టి తెలంగాణ ఏర్పడిన తరువాత తెరాస లో చేరారు. కుల మత అనే బేధాలు లేకుండా తన దగ్గరకు ఆపదలో వచ్చిన వారు ఎవరైనా సరే వారికి అండగా ఉండి తన వంతు సాయం చేసేవాడు. ఏ పండుగైన సరే అన్నదానం చేసి తన మంచితనాన్ని అందరికి పంచేవాడు. ఏ పార్టీ వాళ్ళు అయినా సరే యూసఫ్ అన్న దానం చేస్తే ఎటువంటి కోప తాపాలు లేకుండా వచ్చేస్తారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు దగ్గరగా ఉంటూనే, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు యూసఫ్. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన భార్య ని తెరాస నుండి నిలబెట్టి మంచి మెజారిటీతో గెలిచారు.

యూసఫ్ వెనకే చాలా మంది యువత తెరాస లో చేరి రాజకీయాల వైపు అడుగులు వేశారు.

Read Previous

జంతువుల్లో కరోనా కన్ఫామ్: పరిస్థితి చేజారనుందా ?

Read Next

ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త…. ఏప్రిల్ 15న లాక్ డౌన్ ఎత్తివేత