అలర్ట్: బెల్లంపల్లి సింగరేణి కార్మికుడికి కరోనా పాజిటివ్
Timeline

అలర్ట్: బెల్లంపల్లి సింగరేణి కార్మికుడికి కరోనా పాజిటివ్

ముగ్గురికి కరోనా పాజిటివ్

• బెల్లంపల్లి బొగ్గుబాయిలో కార్మికునికి

• క్వారంటైన్లో కార్మికులు, అధికారులు

మంచిర్యాల జిల్లాలో మరో ముగ్గురు స్థానికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. శనివారం 25 మంది నమూనాలను హైదరాబాదు పంపగా ముగ్గురికి పాజిటివ్, 22 మందికి నెగెటివ్ వచ్చింది.

ఆదివారం నమోదైన పాజిటివ్ కేసులలో ఒకరు బెల్లంపల్లి లోని బొగ్గుగని కార్మికుడు కాగా ఇద్దరు రామకృష్ణాపూర్ కు చెందినవారు.

బెల్లంపల్లి పట్టణంలో కలకలం

బెల్లంపల్లి సింగరేణి కార్మికునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పట్టణంలో కలకలం చేసింది. కార్మికులు, అధికారులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. సదరు కార్మికుల కొడుకు పూణే నుంచి 2 నెలల క్రితం బెల్లంపల్లి వచ్చి ఈనెల 1 తిరిగి వెళ్ళాడు. పాజిటివ్ వచ్చిన కార్మికులు కన్నాల బస్తీ, కన్నాలతోపాటు గోదావరిఖనిలో జరిగిన వివాహ వేడుకలకు హాజరైనట్లు పలువురు పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురికావడంతో ఐసో లేషన్లో చేరగా ఆదివారం పాజిటివ్గా ప్రకటించారు. కార్మికులు ఎక్కడికి వెళ్ళా డు, ఎవరిని కలిశాడనే కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published.