శిల్పా vs శ్రీముఖి: హింసాత్మక వినోదంతో నలిగిపోయిన శిల్పా.. నెటిజన్ల ఆగ్రహం

‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షోకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బిగ్ బాస్ పెట్టె టాస్కుల వలన కంటెస్టెంట్ల కంటే చూసే ప్రేక్షకులే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కుటుంబంతో చూసే వీలు లేకుండా చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

అయితే యదావిధిగా వారంలో నామినేషన్ ప్రక్రియ జరుగుతూనే ఉండగా ఇంతలోనే సడన్ గా ఈ హౌస్ లోకి మాత్రం ఒక కొత్త వ్యక్తి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ వారంలో ప్రముఖ యాంకర్ శిల్పా చక్రవర్తి ఎంట్రీ అనేది అందరిని కూడా చాలా షాక్ కు గురి చేసిందని చెప్పాలి.

ఇకపోతే ఇప్పటివరకు కూడా ఈ బిగ్ బాస్ హౌస్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి శ్రీముఖి కాన్ఫిడెన్స్ ని తగ్గించేందుకే శిల్పాని హౌజ్ లోకి వచ్చిందని సమాచారం. కాగా శిల్పా చక్రవర్తి ఈ ఇంటిలోకి అడుగు తీవ్రమైన పరిణామాలు జరిగాయనేది వాస్తవం.

ప్రస్తుతం బిగ్ బాస్ లో దొంగల ఎపిసోడ్ లెవెల్ 2 రెండోరోజూ కొనసాగింది. నిధిని కాపాడుకోవడం మొదటి లెవెల్ ఈ భాగంలోనే హౌస్ మేట్స్ హింశాత్మకంగా ప్రవర్తించి.. రక్తాలు కారేలా వ్యవహరించారు. ఇక లెవెల్ 2 లో దొంగల రాణిని పట్టుకుని బంధించడం చూస్తూనే బిగ్ బాస్ హింసాత్మక వినోదంతో ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ఈ ఎపిసోడ్ లో ఏ మాత్రం హర్షించదగ్గ అంశాలు లేవు. దొంగల రాణిగా ఉన్న శిల్పను బంధించి జైలు లో పెట్టడమే ముఖ్యమైన టార్గెట్. నగరవాసులు ఆమెని పట్టుకోవాలి.. దొంగలు ఆమెను రక్షించాలి. ఈ రెండు ముక్కలూ చాలు టాస్క్ వెనుక ఎంత హింస ఉంటుందో చెప్పడానికి.

ఇక శిల్పకి చుక్కలు చూపించారు హౌస్ మేట్స్. కొత్తగా హౌస్ లోకి వచ్చింది. సరిగ్గా దొరికింది అనుకున్నారేమో ఇష్టం వచ్చినట్టు ఆమెను ఆదేసుకున్నారు. ఆమెను బంధించాలనే ప్రయత్నంలో వివరించి చెప్పలేని విధంగా ఆమెపై హింస చోటు చేసుకుంది. ఇది హౌస్ మేట్స్ తప్పు ఎంతమాత్రం కాదు. గేమ్ ఆడాలి అన్నప్పుడు అందరూ గెలవాలని ప్రయత్నిస్తారు. అందులోనూ ఇటువంటి ఆటలో విచక్షణ ఉండే ఛాన్స్ లేనేలేదు. సరిగ్గా అదే జరిగింది. తన ఆయుధాన్ని రక్షించుకోవడానికి స్విమ్మింగ్ పూల్ లోకి దూకింది శిల్ప. ఆమెను కాపాడటానికి రవి దూకాడు. ఆమెను పట్టుకోవడానికి శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ దూకారు. రెండు గ్రూపుల మధ్యలో స్విమ్మింగ్ పూల్ లో నలిగిపోయింది శిల్ప.