సామ్ జామ్ షోలో బిగ్ బాస్ అభిజీత్ ?

లాక్ డౌన్ పుణ్యమా అని స్టార్ హీరోలు హీరోయిన్లు కొత్త కొత్త షోలు చేస్తున్నారు. తెలుగు యువ నటి , లేడీ సూపర్ స్టార్ , అక్కినేని కోడలు సమంత ఈ మధ్యనే ఆహ ఓటిటి కోసం సామ్ జామ్ అనే చాట్ షో చేస్తుంది . ఇప్పటికే ఈ షో లో రకుల్ , తమన్నా , విజయ్ దేవరకొండ ఇలా పెద్ద పెద్ద స్టార్లు వస్తున్నారు. ఇక పోతే ఈ నెలలో చిరంజీవి మరియు అల్లు అర్జున్ కూడా రానున్నారని సమాచారం. అయితే లేటెస్ట్ గా మీడియా సర్కిల్స్ లో వినబడుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్లో పాపులర్ అయినటువంటి అభిజీత్ కూడా ప్రత్యక్షం కానున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అదే గనుక జరిగితే మళ్ళీ సినిమా ఆఫర్లు బాగానే వస్తాయ్ మనోడికి.