రవికృష్ణ ఎలిమినేట్

9

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-3 నుంచి నటుడు రవికృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్, రవికృష్ణలు నామినేషన్‌లో ఉండగా, వరుణ్ సేఫ్ అయినట్టు హోస్ట్ నాగార్జున శనివారమే ప్రకటించాడు. ఇక, మిగిలిన ముగ్గురిలో అతి తక్కువ ఓట్లు వచ్చిన రవికృష్ణ గత రాత్రి ఎలిమినేట్ కాక తప్పలేదు. మరోవైపు, గతంలో ఎలిమినేట్ అయిన అలీ రెజా తిరిగి షోలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

    షో నుంచి ఎలిమినేట్ అయితే విజయవాడ వెళ్లి కుటుంబ సభ్యులను కలుస్తానన్న రవికి నాగార్జున విమాన టికెట్ అందించాడు. ఇక ప్రస్తుతం హౌస్‌లో అలీ రెజా, రాహుల్, పునర్నవి, వితిక, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, మహేష్, శివజ్యోతి, శ్రీముఖి ఉన్నారు.