బిగ్ బాస్ సీజన్ 4 సెప్టెంబర్ 6 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం కాబోతుంది. నాగార్జున హోస్ట్ అన్నది ఎలాగూ ఫిక్స్.. ఇక కంటెస్టెంట్స్ ఎవరన్నది బయటకు పొక్కకుండా చాలా సీక్రెట్‌గానే ఉంచుతున్నారు నిర్వాహకులు. అయితే ఎంత సీక్రెట్‌గా ఉంచినా తెరపై కనిపించే హఠాత్తుగా మాయమయ్యేసరికి కూపీ లాగడం.. తద్వారా లీకులు బయటకు వస్తూనే ఉంటాయి.
అయితే స్టార్ మా బిగ్ బాస్ 4 సెట్ ని రివీల్ చేయబోతున్నట్టు ట్వీట్ చేసింది. మీరు రెడీ నా అంటూ ఒక పోస్ట్ పెట్టింది.