బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పై యావత్ దేశం దృష్టి సారించింది. మొన్న శనివారం మూడో దశపోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. నాకివే చివరి ఎన్నికలు అంటూ సెంటిమెంట్‌‌తో పిండేసిన సీఎం నితీశ్ ‌కు బిహార్ ఓటర్లు విజయం కట్టబెడతారా? NDA కూటమి మరోసారి అధికారం దక్కించుకుంటుందా? లేకపోతే.. కాంగ్రెస్, RJD కూటమి.. నితీశ్ విజయాలకు బ్రేకులు వేస్తుందా? తద్వారా ఢిల్లీ పీఠానికి బలమైన సంకేతం పంపుతుందా? 15 ఏళ్ల తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ మరోసారి అధికారం చేపడుతుందా? అని అందరూ ఆసక్తిగా గమనించిన ఎగ్జిట్ పోల్స్ సంచలనం రేపాయి.

గెలుపు తేజస్విదే అని , బీజేపీ కుప్ప కూలిపోవడం ఖాయం అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ బిల్డుప్ ఇచ్చాయి. కానీ ఈరోజు కౌంటింగ్ లో ఎన్డీయే లీడింగ్ చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ ని ఎగిరి తన్నేలా కనిపిస్తున్నాయి ఫలితాల. మొన్న 2019 ఎన్నికల్లో కూడా ఇలాగే జరిగింది కానీ మోడీ హవా మాత్రం ఏమాత్రం తగ్గలేదు .

అదే స్టోరీ మళ్ళీ ఇక్కడ బీహార్ లో కూడా రిపీట్ అవుతుందేమో అన్నట్టుగా ఉన్నాయి ఈరోజు కౌంటింగ్ లో వెలువడున్నా ఫలితాలు . ఇంకా సమయం ఉన్నమతా వాస్తవమే అయినా ఈ లెక్కలవేమో తేడా కొట్టే యవ్వారంలానే ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.