Breaking News :

TV9 పై బిత్తిరి సత్తి పంచులు..అది కూడా సాక్షి టీవీలో

అవును బిత్తిరి సతి పంచులు వేసింది TV9 పైనే, అది కూడా సాక్షి టీవిలో తాను చేయబోతున్న కొత్త ప్రోగ్రాం ప్రోమోలో .

నిన్నటి దాకా సత్తి పని చేసింది టీవీ9 లోనే. అయితే ఈ మధ్యే అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి సాక్షి టీవిలో దర్శనం ఇవ్వబోతున్నాడు సత్తి. టీవీ9 కి రాజీనామా చేసి కొత్త ఛానల్ కి వెళ్తే పథ ఛానల్ పై పంచులేంటి అనుకోవచ్చు. అయితే అక్కడే ఉంది ట్విస్ట్.

అసలు మ్యాటర్ ఏంటంటే ఎంచక్కా తెలంగాణ ఛానల్ గా పేరుపొందిన వి6 లో దర్జాగా పని చేసుకుంటున్న సత్తిని ఎక్కువ జీతం ఆశ చూపి TV9 సత్తిని ఎత్తుకొచ్చేసింది. ఈ దెబ్బతో V6 రేటింగ్స్ కి, తీన్మార్ వార్తల ప్రోగ్రామ్ కి కాస్త చిల్లు పడింది. తరువాత తరువాత వారు కాస్త లైట్ తీసుకొని ప్రోగ్రాం ని కొత్త యాంకర్లతో గాడిలో పెట్టి బాగానే వ్యూస్ సంపాదిస్తున్నారు మళ్ళీ.

కానీ సత్తిని పట్టుకెళ్లిన tv9 కి మాత్రం అంతగా అనుకున్నంతగా రేటింగ్స్ రాలేకపోయాయని, అందుకే నెలకు 4 లక్షల జీత ఇవ్వడం దేనికి అని, పొమ్మనలేక పొగబెట్టి ఏదో ఒక సాకుతో బయటకు నెట్టేశారని మీడియా వర్గాల్లో వినబడిన మాట.

అయితే ఇంతకీ ఏ సాకుతో సత్తిని బయటకు పంపేశారని చాల మందికి తెలియదు. ఏంటంటే సత్తి ఫాథర్స్ డే రోజున తన తండ్రి ఫోటో పెట్టి షో చేసాడని, అది యాజమాన్యం పాలసీలకు విరుద్ధం అని, యాజమాన్యం మాట లెక్క చేయకుండా సొంత తెలివితేటలు వాడుతున్నాడని ఇలా అనేక రకాలుగా కారణాలు చూపి బయటకు వెళ్లేలా చేసారని సమాచారం. ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది ఆ దేవుడికి, సత్తికే తెలియాలి.

కానీ ఇందులో కాస్త నిజమే ఉందని ప్రూవ్ చేస్తూ సత్తి సాక్షి టీవీ కి చేయబోయే కొత్త ప్రోగ్రాం ప్రోమోలో tv9 పై , తనకు అక్కడ ఎదురైన అనుభవాలపై సెటైర్లు వేస్తూ కొన్ని డైలాగులు విసిరాడు. ఇది ఇపుడు మీడియా సర్కిల్స్ లో రచ్చ రచ్చ అయిపోయింది. అంతే కాదు ఇక ముందు నేనంటే ఏంటో చూయిస్తా అని సవాల్ కూడా విసిరాడు సత్తి.

ఈ ప్రోమో చుస్తే మీకు క్లియర్ పిక్చర్ అర్ధం అవుద్ది

Read Previous

కరోనా: హైదరాబాద్ లో డేంజర్ జోన్లు ఇవే

Read Next

తెలంగాణ: 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ