ఎక్స్ క్లూజివ్: TV9 కి బిత్తిరి సత్తి రాజీనామా వెనక ఉంది ఎవరు?
Timeline

ఎక్స్ క్లూజివ్: TV9 కి బిత్తిరి సత్తి రాజీనామా వెనక ఉంది ఎవరు?

bithiri sathi tv9 v6

తెలుగు మీడియాలో బిత్తిరి సత్తికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జీరో నుంచి హీరో వరకు ఎదిగాడు. దానికోసం V6 ఛానెల్‌లో తీన్మార్ న్యూస్ అంటూ రచ్చ చేసాడు. కొన్నేళ్ల పాటు అద్భుతంగా సాగిన ఈయన గత సంవత్సరం TV9 ఛానెల్‌లోకి మారిపోయాడు. మొదట్లో V6 ఛానెల్‌లో చేసిన కార్యక్రమం కంటే TV9 చేస్తున్న ప్రోగ్రామ్ అంతగా విజయం సాధించలేదనేది అందరికి తెలిసిన విషయమే. అంతే కాదు ఈ కార్యక్రమం రేటింగ్స్ పరంగా కూడా ఛానల్ యాజమాన్యానికి సంతృప్తిని ఇవ్వలేదన్నది మీడియా సర్కిల్స్ లో వినిపించిన మాట.

కానీ TV9 యాజమాన్యం మారిన తరువాత మళ్ళీ తెలంగాణ లో జండా పాఠాలని చూసిన టీమ్ కి బిత్తిరి సత్తి అవసరం ఏర్పడింది. ఏం జరిగిందో తెలీదు, ఎవరు డీల్ కుదిర్చారో తెలీదు ఉన్నపలంగా సత్తి V6 కి రాజీనామా చేసేసి TV9 లో చేరిపోయాడు. ఆ తరువాత బిగ్ బాస్ నుండి బయటికొచ్చిన సావిత్రి కూడా తోడైంది. అప్పటి వరకు పెద్దగా జనాలను అట్ట్రాక్ట్ చేయలేకపోయినా సత్తి , సావిత్రి ఎంట్రీతో మళ్ళీ జోష్ గా స్కిట్లు చేసాడు. అనుకున్నట్టుగానే టీఆర్పీ రేటింగులు కూడా సాదించేసాడు.

ఒకటి TV9 యాజమాన్యం స్ట్రాటెజీగా v6 నుండి బిత్తిరి సత్తిని తప్పించి ఛానల్ ని రేటింగులు పరంగా దెబ్బకొట్టింది. ఇక సత్తి షో సక్సెస్ అనేది వాళ్లకు బోనస్ అంతే.

అయితే ఇపుడు సడెన్ గా TV9 కి బిత్తిరి సత్తి రాజీనామా చేసేసాడు. మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ఏంటంటే కొన్ని స్కిట్స్ యాజమాన్య నిర్ణయాలకు విరుద్ధంగా సొంత నిర్ణయాలు తీసుకొని చేసాడు అని, సంజాయిషీ అడిగితే రాజీనామా ముందు పెట్టాడనేది ఒక వర్గం చెపుతున్న మాట.

తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా చనిపోయిన సత్తి తండ్రి ఫోటో పెట్టి  చేసిన ఓ స్కిట్ విషయంలో గొడవ జరిగిందని టాక్.. ఇంటర్నల్ గా పెద్ద దుమారమే చెలరేగిందని తెలుస్తోంది. దీనిని సీరియస్ గా తీసుకున్న యాజమాన్యం సత్తిని ఛానల్ ని తీసేసిందని సమాచారం.. దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది.

ఇంకో వర్గం చెప్తున్నది పొమ్మనలేక పొగబెట్టినట్టు యాజమాన్యమే కావాలని బయటకు పంపేసింది అనేది ఇంకోటి. ఒక్క సత్తినే కాదు, సుత్తితో పాటు ఇస్మార్ట్ న్యూస్ షో డైరెక్టర్ కూడా రాజీనామా చేసినట్టు సమాచారం.

1 Comment

Leave a Reply

Your email address will not be published.