ఉదయం పార్టీలో చేరాడు..సాయంత్రం బయటకు గెంటేశారు… షాహీన్ బాగ్ కాల్పుల నిందితుడు కపిల్ గుజ్జర్

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో పెద్ద ఎత్తున నిరవధిక నిరసన జరిగింది. మహిళలు నేతృత్వం వహించిన ఈ నిరసన దేశ వ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారాన్ని సృష్టించింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి చివరి వారంలో నిరసనను ముగించారు. అయితే ఫిబ్రవరిలో షహీన్‌బాగ్ నిరసనకారుల వద్దకు వచ్చిన గుర్జార్.. గాలిలో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపుతూ ‘‘జై శ్రీరాం’’, ‘‘మా దేశంలో హిందువులు మాత్రమే ఏదైనా చెప్పాలి. ఇంకొకరు చెప్పకూడదు’’ అంటూ నినదించాడు. అనంతరం, అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశాడు.

ఈరోజు కపిల్ గుర్జార్, భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌కు చెందిన బీజేపీ కమిటీ.. బుధవారం గుర్జార్‌కు పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించింది. పార్టీలో చేరిన అనంతరం గుర్జార్ మాట్లాడుతూ ‘‘నేను బీజేపీలో చేరడానికి ఇంతకు ముందే సిద్ధమయ్యాను. బీజేపీనే ఎంచుకోవడానికి కారణం, ఆ పార్టీ హిందుత్వం కోసం పని చేస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు.

అయితే ఒక హంతకుడు బీజేపీలో చేరడం పై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శల కారణంగా బీజేపీ కపిల్ మెంబర్షిప్ ను క్యాన్సల్ చేసేసింది. ఈ విషయాన్ని అధికారికంగా బీజేపీ ప్రకటించింది.

Image