తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలహీన పడేకొద్దీ రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడం మొదలైంది. గత లోక్ సభ, దుబ్బాక, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఈ విజయాల తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్మాయం బీజేపీనే అనే భావన ప్రజల్లో ఏర్పడింది. ఇక మరికొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ సాగర్ సీటును కూడా కైవసం చేసుకుని రాష్ట్ర ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపించుకోవాలని చూస్తున్నారు బీజేపీ శ్రేణులు. ఇందులో భాగంగానే నాగార్జున సాగర్ బరిలో విజయ శాంతిని పెట్టాలని బీజేపీ చూస్తోంది. రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఆమె అయితే విజయం తప్పకుండా బీజేపీకే వరిస్తుందని భావిస్తోందట. ఢిల్లీ పెద్దలకు కూడా ఇదే సమాచారం చేరవేశారని వినిపిస్తోంది. గత ఏడాది డిసెంబర్ నెలలో విజయశాంతి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
Timeline
Telangana Bypoll: నాగార్జున సాగర్ రేసులో రాములమ్మ ?
- by Telugucircles
- January 23, 2021
- 0 Comments
- 8 Views
