శశికళ రీ ఎంట్రీ … ఆసుపత్రి హంగామా రాజకీయ కుట్రనా?
Timeline

శశికళ రీ ఎంట్రీ … ఆసుపత్రి హంగామా రాజకీయ కుట్రనా?

తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన ఆమె, బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి నాలుగేళ్ల తర్వాత బయటకొచ్చారు. కరోనా సోకడంతో ఆమె ప్రస్తుతం విక్టోరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో విడుదల ప్రక్రియను జైలు అధికారులు హాస్పిటల్లోనే పూర్తి చేశారు. కరోనా లక్షణాలేవీ లేని శశికళను సన్నిహితులు చెన్నైలోని ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించే అవకాశం ఉంది. ఆమె ఎప్పుడు చెన్నై వెళ్తారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

నిజంగానే ఆరోగ్య సమస్యా ? రాజకీయ రీ ఎంట్రీ కోసం హంగామానా ?

జయలలిత మరణం తరువాత శశికళ సీఎం అవుతుందని అందరూ భావించారు. జయలలిత సమాధి వద్దకు వెళ్లి శపథం కూడా చేశారు. అయితే ఆమె సీఎం అయితే మళ్ళీ తమిళనాడులో బీజేపీ కి ఛాన్స్ ఉండదనుకున్న హై కమాండ్ శశికళను జైలుకు పంపించి , తనను వారి గుప్పిట్లో కీలు బొమ్మను చేసారు అనేది తమిళనాడు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఈ మధ్య బీజేపీ సౌత్ మీద స్ట్రాంగ్ ఫోకస్ పెట్టింది. తమిళనాడులో కూడా సినీ తారలు , హిందుత్వ వాదులు , అన్నా డీఎంకే , డీఎంకే నచ్చని వారు బీజేపీ లో జాయిన్ అవడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ నేత కుష్బూ కూడా బీజేపీలో చేరడంతో ఇంకాస్త మజా వచ్చింది తమిళనాడు రాజకీయాల్లో.

అయితే ఇపుడు రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడటంతో, ఎలాగో బీజేపీ చేతిలో అన్న డీఎంకే కీలు బొమ్మ అనే వాదనలు ఉన్నాయి. ఇపుడు దీనికి శశికళ కూడా తోడైతే జయలలిత అభిమానులు, అన్నా డీఎంకే నేతల్లో జోరు పెరుగుతుందని , డీఎంకే కి గట్టి పోటీ ఇవ్వొచ్చని ఆ తరువాత బీజేపీ చక్రం తిప్పొచ్చనే ఆలోచనతోనే శశికళ ను జైలు నుండి రప్పించారట. ఊరికే జైలు నుండి బయటకు వస్తే మీడియా అట్టెన్షన్ పెద్దగా ఉండదు అని భావించి, మరి కొద్దీ రోజుల్లో విడుదల అయ్యే ముందు ఆరోగ్య సమస్య కారణంగా ఆసుపత్రికి వెళ్తే అందరి చూపు శశికళ పైనే ఉంటుందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.