ఉత్తరప్రదేశ్‌లోని బిజెపి ఎమ్మెల్యే తన కారుపై కాల్పులు జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసారు. సోమవారం సాయంత్రం భరౌలి-సాలెంపూర్ రహదారిపై జరిగిన సంఘటనలో తన కారు వెనుక విండో పేన్ దెబ్బతిన్నట్లు రాష్ట్ర డియోరియా జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తన కారుపై కొంతమంది కాల్పులు జరిపి, కారు వెనుక విండో పేన్‌ను పగలగొట్టారని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సాలెంపూర్ బిజెపి ఎమ్మెల్యే కాశీ ప్రసాద్ ఆరోపించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు, అంతే కాకుండా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
ADVERTISEMENT
ADVERTISEMENT
సంఘటన జరిగిన సమయంలో చక్రవ భోర్దాస్ గ్రామంలో బిజెపి కార్యకర్తల సమావేశం నుండి ఎమ్మెల్యే తిరిగి వస్తున్నారు.