Breaking News :

పవన్ హిందూ వ్యాఖ్యలపై రాజాసింగ్ ఫైర్

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సోమవారం తిరుపతిలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అని వ్యాఖ్యానించారు. మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని పవన్‌ ఆరోపించారు. ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరని అన్నారు. తాను చిన్నప్పటి నుంచి వింటోంది ఒకటేనని..సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతోంది హిందూవులు మాత్రమేనని వ్యాఖ్యానించారు.

పవన్ చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఖండించారు. హిందూమతం, ధర్మం గురించి కనీస అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్‌ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? అని ప్రశ్నించారు. హిందూ మతాన్ని టార్గెట్‌గా చేసిన మట్లాడం సరైనది కాదని, లౌకికతత్వంపై పవన్‌కు కనీస అవగాహన లేదని హితవుపలికారు. పవన్‌ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు.

Read Previous

జైలు పరిసరాల్లో భారీ బందోబస్తు

Read Next

చేతకాకపోతే తప్పుకోండి