సుబ్రమణ్య స్వామి: టీడీపీ, బీజేపీవి నాటకాలు, జగన్ సూపర్

దేశ వ్యాప్తంగా గత రెండు రోజులుగా సంచలనంగ మరీనా టీటీడీ భూముల అమ్మకాల విషయం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం లేపింది. అయితే అధికార పక్షం ఒక వైపు ఈ భూముల అమ్మకాల నిర్ణయం చంద్రబాబు హయాంలోనే జరిగిందని చెప్పినా కూడా బీజేపీ జనసేన జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశాయి. అంతే కాకుండా జగన్ ని మతపరంగా దూషిస్తూ కామెంట్లు కూడా చేసారు కొందరు నేతలు. ఈ భూముల అమ్మకాలు జరగకూడదు అని, హిందూ దేవాలయాల సంరక్షణ కోసం ఉపవాస దీక్షలు చేసారు బీజేపీ జనసేన నేతలు.

అయితే ఈ రచ్చ కాస్త హిందువులు అత్యంత గౌరవంతో ఇష్టపడే ఒకే ఒక్క నాయకుడు, మాజీ మంత్రి, దేశం గర్వించదగ్గ లాయర్ సుబ్రమణ్య స్వామి ని చేరింది. అక్కడే కథంతా మొదలైంది. రంగంలోకి ఆయన దిగాలని హిందువులు కోరారు. అయితే అయన మాత్రం వాళ్ళ అందరికి షాక్ ఇచ్చారు. జగన్ ని విమర్శించే వాళ్లందరికీ గట్టిగా ఆన్సర్ ఇచ్చారు. మీరందరు 2017 లో ఎటు పోయారు. ఇదంతా చంద్రబాబు పనే అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.

ఒక క్రిస్టియన్ సీఎం అయ్యుండి హిందువులు అడగగానే వారికి గౌరవం ఇచ్చి భూముల అమ్మకాలను ఆపేసిన జగన్ ఇంత చేస్తే మన హిందూ సీఎం అయ్యుండి ఉత్తరాఖండ్ లో అన్ని దేవాలయాలను అయన ఆధీనంలోనే పెట్టుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.

ఈ రోజు అయన సాక్షి టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కుండబద్దలు కొట్టి ఆయన స్టాండ్ ని చెప్పేసాడు. ఇదంతా టీడీపీ బీజేపీ చేస్తున్న మత రాజకీయం అని, ప్రజలు ఇలాంటి అబద్దాలు నమ్మరని. చేసిందంతా బీజేపీ టీడీపీ నే అని దీనికి జగన్ కి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

అంతే కాకుండా జగన్ ఖశ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ నిజాలన్నీ ప్రజలకు చెప్పాలని, అంతటితో వదిలేయకుండా చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని. నిజాయితీ లేని చంద్రబాబు రాజకీయాలకు పనికి రాడని చెప్పారు.

జగన్ నాయకత్వ లక్షణాలు నాకు తెలుసనీ, చెప్పింది చేసే.. దేశంలోనే అతి కొద్దీ మంది రాజకీయ నాయకుల్లో జగన్ ఒకడు అని కితాబులిచ్చారు సుబ్రమణ్య స్వామి. జగన్ బాబాయి హార్డ్ కోర్ హిందూ అని నాకు తెలుసు వీళ్ళు కావాలనే రాజకీయం కోసం ఆయనను క్రిస్టియన్ అంటూ అపవాదం వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు.