ఏపీ బీజేపీలో పార్టీ హైకమాండ్ కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను పదవి నుంచి తప్పించి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును నియమించారు. ఆయన స్థానంలో సోమువీర్రాజును అధ్యక్షుడిగా నియమించారు.
ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా ప్రకటన విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా కత్తేరు గ్రామానికి చెందిన సోము వీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు ప్రమోషన్ ఇచ్చిన హైకమాండ్.. పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించింది.
కాగా, గత ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు ఆయన పదవిలో ఉన్నారు. ఏపీలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పార్టీ పెద్దలు.. అధ్యక్షుడి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కన్నా స్థానంలో ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజుకు పదవి కట్టబెట్టింది.