బ్రేకింగ్: రాజమౌళి విషయంలో బండి సంజయ్ పై హైకమాండ్ సీరియస్?

ఇటీవల విడుదలైన ‘RRR’ టీజర్ తీవ్ర వివాదాస్పదమవుతోంది. టీజర్‌ చివరలో ఎన్టీఆర్ ముస్లిం మతానికి సంబంధించిన టోపీ పెట్టుకుని కనిపించడంపై ఆదివాసీలు అభిప్రాయం వ్యక్తం చేసారు. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ దర్శకుడు రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి విడుదల చేస్తే… అడుగడుగునా అడ్డుకుంటామని… సినిమా రీళ్లను తగలబెడుతామని హెచ్చరించారు. అంతేకాదు,బీజేపీ కార్యకర్తలు మీ ఆస్తులను ధ్వంసం చేస్తారు జాగ్రత్త అని, హిందూమతాన్ని అవమానపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.

ఒకవేళ సినిమా రిలీజ్ చేస్తే బరిగాలతో కొట్టి సమ్పయుత్తం అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇదే తలనొప్పిగా మారింది బండి సంజయ్ కి.

ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. దేశమంతా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దుబ్బాకలో గెలవటం కోసం రాజమౌళి లాంటి వ్యక్తిపై ఇలాంటి కామెంట్లు చేయడం ఎవరూ సచించలేకపోతున్నారు.

అసలు నువ్వు ఎంపీగా గెలవటమే ఒక వింత , నిన్ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎలా చేసారో ఎందుకు చేసారో అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పప్పులు ఉడకవంటూ, సినిమానా మతమా అంటే సినిమాకే ఎక్కువ మద్దతు ఇస్తాం అంటూ మరి కొందరు విమర్శలు చేస్తున్నారు.

అయితే ఈ విషయం పై బీజేపీ సీనియర్ లీడర్లు కూడా పెదవి విరుస్తున్నారు. బండి సంజయ్ ప్రవర్తన పై హైకమాండ్ సీరియస్ గా ఉందని బీజేపీ వర్గాల నుండి వస్తున్న సమాచారం. ఇప్పటికే బండి కి హైకమాండ్ నుండి ఫోన్ వచినట్టు తెలుస్తుంది. దుబ్బాక ఎన్నికల తరువాత దీనిపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు బీజేపీ పెద్దలు.

బండి సంజయ్ కూడా ఎందుకు రాజమౌళిని గెలికానా అనుకుంటున్నారని తెలుస్తుంది. ఒక డైరెక్టర్ ని తిడితే ఇన్ని విమర్శలు వస్తాయని అస్సలు ఊహించి ఉండరు బీజేపీ నేతలు. నిజానికి ఇంకే డైరెక్టర్ ని టార్గెట్ చేసిన ఇలాంటి రియాక్షన్ వచ్చి ఉండదు కానీ రాజమౌళి తెలుగు సినిమానే కాదు ఏకంగా ఇండియన్ సినిమానే ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిన డైరెక్టర్ ఇపుడు.