బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం ఉదయం గుంటూరులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం చూసి ప్రజలు టిడిపి కి అవకాశం ఇచ్చారని, ఆయన తన అనుభవాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం కోసం వాడారని విమర్శించారు. ఆర్భాటాలకు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారని, గడచిన ఐదేళ్లలో చంద్రబాబు చేసిన తప్పులు ఎత్తి చూపిన జగన్‌ ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించారని చెప్పారు. ప్రజలు మంచి మార్పు కోరుకుని జగన్‌ కు అవకాశం ఇచ్చారన్నారు.

ఉపాధి హామీ కింద గత మూడు నెలల్లో రూ.18 వందల కోట్లు కేంద్రం ఇచ్చిందని, కానీ పాత బకాయిలు కూడా ఇంకా చెల్లించలేదని చెప్పారు. వంద రోజుల్లో రాష్ట్ర అభివఅద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఒక్కటైనా చెప్పగలరా.. అని ప్రశ్నించారు. ” బిజెపి నేతల నాలుకలు చీరేస్తామని కొందరు మాట్లాడుతున్నారు.. మీ గురించి ప్రజలకు తెలిసే 2014 లో అధికారం ఇవ్వలేదు ” అని చెప్పారు.

చంద్రబాబు అరాచకాలు చూసి అధికారం ఇస్తే… వారు అంతకంటే ఎక్కువ చేస్తున్నారని విమర్శించారు. దేవాలయ భూములను పంపిణీ చేయటానికి వాళ్ల తాత సొమ్ము కాదని నిప్పులు చెరిగారు. ఆలయాల పరిరక్షణ కోసం దాతలు ఇచ్చిన భూములు అప్పణం గా ఇస్తారా అని ప్రశ్నించారు. సదావర్తి భూములు అక్రమంగా కట్టబెట్టడితే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తమ కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని, ఈ నెల 16 న బిజెపి ఆధ్వర్యంలో ధర్నా చేయబోతున్నామని ప్రకటించారు. బిజెపిలో చేరిన వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. తాను రాసిన లేఖలకు ఒక్కదానికి సమాధానం లేదని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.