Breaking News :

బీజేపీ,పవన్ కళ్యాణ్ కి కలిపి క్లాస్ పీకిన సుబ్రమణ్య స్వామి

టీటీడీ భూముల అమ్మకంపై తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు రెండు రోజుల నుండి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయ విమర్శలతో పాటు మత పరమైన కామెంట్లు కూడా చేశారు. అయితే బీజేపీ తో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ని నిన్న తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ కలిసి ఈ విషయమై చర్చించినట్టు సమాచారం.

అయితే ఈ రోజు ఉదయం నుండి ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటు బీజేపీ నాయకులూ, ఇటు జనసేన నాయకులూ ఇళ్లల్లోనే కూర్చొని ఉపవాస దీక్షలు చేస్తున్నారు.

దీనిలో భాగంగానే నిన్నటి నుండి ట్విట్టర్ వేదికగా ఈ అంశం పై పలు కామెంట్లు చేసారు. దీనికి బీజేపీ నేతల మద్దతు కూడా దొరికింది. అయితే కర్ణాటకకు చెందిన యువ ఎంపీ తేజస్వి సూర్య పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి ఈ అంశంపై గట్టిగా పోరాడాలని కోరారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా రిప్లై ఇచ్చి సరే అన్నారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తేజస్వి ని, పవన్ కళ్యాణ్ ని ఆ ట్వీట్ తో టార్గెట్ చేస్తూ బీజేపీ అగ్ర నేత సుబ్రమణ్య స్వామి కౌంటర్ ట్వీట్ చేశారు. జగన్ ని అడుగుతున్నారు సరే మన పార్టీ నేతల సంగతేంటి. మన బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ లో మన సీఎం గారే ఏకంగా చైర్మన్ అయ్యారు . దానికి మనం ఏం సమాధానం చెప్పాలి అంటూ ఘాటుగా స్పందించారు.

సుబ్రమణ్య స్వామి నిన్నటి నుండే జగన్ మాత్రమే టార్గెట్ చేస్తూ , చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నపుడు ప్రశ్నించకుండా ఇపుడు ట్వీట్లు పెడుతున్న వారందరికీ గట్టిగానే కౌంటర్ ఇస్స్తున్నారు.

Read Previous

బిగ్ బ్రేకింగ్: బాబుకి రిటర్న్ గిఫ్ట్, వైసీపీలో చేరనున్న 7 మంది టీడీపీ ఎమ్మెల్యేలు

Read Next

ఏపీ హైకోర్ట్: ప్రభుత్వం దివాళా తీసిందా? బిల్డ్ ఏపీ పథకంపై ఫైర్