టీటీడీ కాంట్రవర్సీపై సుబ్రమణ్య స్వామి కౌంటర్, జగన్ కి సపోర్ట్?
Timeline

టీటీడీ కాంట్రవర్సీపై సుబ్రమణ్య స్వామి కౌంటర్, జగన్ కి సపోర్ట్?

తమిళనాడులోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని స్థిరాస్తులను విక్రయించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆస్తుల విక్రయానికి సంబంధించి తీర్మానం చేశారు. ఏప్రిల్‌ 30న బోర్డు ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చేసింది. ఈ రెండు బృందాల్లో 8 మంది అధికారులను నియమిస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తుల బహిరంగ వేలానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు బోర్డు సూచించింది.

అయితే టీటీడీ ఆస్తుల వేలంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఆస్తులు అమ్మే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. వెంకన్నకు భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే హక్కు ఉన్న మీరెలా వేలం వేస్తారని నిలదీశారు. టీటీడీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై బీజేపీ రాజీ లేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

అయితే ఇదిలా ఉంటే ఒకవైపు బీజేపీ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నేతలు టీటీడీ భూముల అమ్మకాలను రాజకీయం చేస్తుంటే బీజేపీ అగ్ర నేత, మోస్ట్ సీనియర్ లాయర్ సుబ్రమణ్య స్వామి మాత్రం రివర్స్ గేర్ లో దీనిని రాజకీయం చేస్తున్న వారికీ కౌంటర్ ఇచ్చారు.

ట్విట్టర్ లో టీటీడీ భూముల అమ్మకాలను ఆపివేయాలంటూ హిందూ సపోర్టర్లు , బీజేపీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున ట్రెండ్ చేసారు ట్వీట్స్ వేసి. అందులో భాగంగా ఇటువంటి వాటిపై ఎక్కువగా స్పందించే సుబ్రమణ్య స్వామిని ట్యాగ్ చేసి కొందరు ఆయన స్పందన కోరగా అయన మాత్రం దీనిని వెనుకేసుకొని రాలేదు. అంతే కాకుండా రివర్స్ లో 2017లో అంటే చంద్రబాబు హయాంలో ఎందుకు ప్రశ్నించలేదు అని కౌంటర్ ట్వీట్ చేశారు.

సుబ్రమణ్య స్వామి ఇలాంటి వివాదాలపై స్పందిస్తారు కానీ ఎవరి తప్పు ఒప్పులు ఉన్నాయి అని చూసుకొని వీటిని ప్రశ్నిస్తారు ఆయన. రాజకీయం ఆయనకు కేవలం టైం పాస్ అంతే. నిజం వైపు సుబ్రమణ్య స్వామి ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే. అంతెందుకు ఎన్నో సార్లు తన సొంత పార్టీ బీజేపీ నాయకులకే ముచ్చెమటలు పట్టించిన గొప్ప వ్యక్తి ఆయన.

గ‌త పాల‌క మండ‌లి నిర్ణయాల‌ను అమ‌లు చేయ‌డానికి ఆమోదం మాత్రమే తెలపినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ ఆస్తులు దేవ‌‌స్థానానికి ఏ విధంగాను ఉప‌యోగ‌ప‌డేవి కాదన్నారు. సదరు నిరర్థక ఆస్తులు 1 నుంచి 5 సెంట్ల లోపు ఉన్న ఖాళీ ఇంటి స్థలాలు, 10 సెంట్ల నుంచి ఎకరం లోపు విస్తీర్ణం ఉన్న వ్యవసాయ భూములుగా ఉన్నాయన్నారు. వీటివల్ల దేవస్థానానికి ఎలాంటి ఆదాయం లేకపోగా, ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉన్నందువల్ల ఈ ఆస్తుల‌ను బ‌హిరంగ వేల‌ము ద్వారా విక్రయించాల‌ని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే కొన్ని ప్రసార సాధ‌నాలు టీటీడీ ఆస్తుల వేలం విక్రయానికి సంబంధించి గత పాలక మండలి తీసుకున్న, పై కమిటీలు తీసుకున్న నిర్ణయాలకు, ప్రభుత్వానికి లింకు పెట్టడం స‌రికాదని వైవీ చెప్పారు. వాస్తవాలు ఇలా ఉండగా కొన్ని ప్రసార సాధనాలు అవాస్తవ సమాచారంతో కథనాలు ప్రసారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం సరికాదని సుబ్బారెడ్డి హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published.