ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వంద రోజుల పాలనలో 110 తప్పులు చేశారని బిజెపి ఎంపీ సుజనాచౌదరి మండిపడ్డారు. చంద్రబాబు, జగన్‌ ప్రభుత్వాలు దొందూ దొందే అని, కీలకమైన పోస్టులు ఒకే సామాజిక వర్గానికే ఇస్తున్నారని విమర్శించారు.

అమరావతి భూములపై తన సవాల్‌ను స్వీకరించే ధైర్యం వైసీపీకి లేదని సుజనా ధ్వజమెత్తారు. అమరావతిలో అవినీతి అన్నారని, ఎందుకు నిరూపించలేకపోయారు? అని జగన్‌ను సుజనా ప్రశ్నించారు. అమరావతిని గోస్ట్‌ సిటీలా తయారు చేశారని, పోలవరం ప్రాజెక్ట్‌ అర్థాంతరంగా నిలిపివేశారని విమర్శించారు.

అంతే కాదు రియల్ ఎస్టేట్ బాగా తగ్గిందని బాధపడ్డారు కూడా .

ఇంతకీ నీ బాధ లంకలో గ్రామాలు మునిగిపోయాయనా లేకపోతే నువ్వు కొన్న భూములు మునిగిపోయాయనా. అరెరే ఎంత కష్టమొచ్చింది సుజనా, పార్టీ మారి కేసుల నుండి అయితే తప్పించుకున్నావ్ గాని కొన్న భూములు కాపాడుకోలేకపోతున్నానే అని నీలో మొదలైన కంగారు బాగా కనిపిస్తుంది.

ఇసుక వ్యాపారాలు చేసిన నీ మాజీ తెలుగు దేశం మిత్రులు చెప్పట్లేదా ఇసుక దొరకట్లేదని. సార్ నువ్వుంది బీజేపీ లో, కానీ నీ మాటలు అచ్చు గుద్దినట్టు టీడీపీ అధినేత చంద్రబాబు , అయన కుమారుడు లోకేష్ వేసే ట్వీట్స్ కి జిరాక్స్ కాపీలా ఉన్నాయ్. బాసూ జర చూస్కో మరి.

అన్యమత ప్రచారం ఎక్కువైందా ? ప్రచారం ఎక్కువైందని ఫేక్ ట్వీట్లు వేస్తున్న ప్రచారకర్తలు ఎక్కువయ్యరా సుజనా? అప్పుడప్పుడు సోషల్ మీడియా ఫాలో అవ్వు సామి.

అసలే ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నాయకుల్లో నీ మీద పీకలదాకా ఉందట. ఎప్పుడెప్పుడు నిన్ను పక్కకు నెట్టేయాలా అని చూస్తున్నారట. ముందు దాని మీద ఫోకస్ పెట్టు , తరువాత ఈ ముచ్చట్లు మాట్లాడుకుందాం.

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings