మొత్తానికి దుబ్బాక సీటు రఘునందన్ రావుకే ఓకే చేసిన బీజేపీ
Timeline

మొత్తానికి దుబ్బాక సీటు రఘునందన్ రావుకే ఓకే చేసిన బీజేపీ

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్​గా పార్టీ అధికార ప్రతినిధి ఎం.రఘునందన్‌‌రావును బీజేపీ హైకమాండ్​ ప్రకటించింది. ఈ విషయాన్ని మంగళవారం రాత్రి కన్ఫార్మ్ చేసింది. దుబ్బాక

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే, అయితే టీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్ గా రామలింగారెడ్డి భార్య సుజాతను ప్రకటిస్తే కాంగ్రెస్‌‌ పార్టీ చెరుకు శ్రీనివాస్‌‌రెడ్డి పేరును కన్ఫార్మ్ చేసేసింది.

రఘునందన్​రావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. అప్పటి నుంచీ తన కేడర్​ను బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టారు. బై ఎలక్షన్​ జరగనుండటంతో రెండు నెలలుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.

అడ్వొకేట్‌‌గా, మంచి వక్తగా పేరున్న రఘునందన్‌‌రావుకు నియోజకవర్గంలో చాలా పరిచయాలున్నాయి. వాస్తవానికి దుబ్బాక బైఎలక్షన్​లో బీజేపీ తరఫున పోటీకి పలువురు నేతలు ఆసక్తి చూపారు. అయితే రెండు నెలలుగా ప్రచారంలో ఉండటం, అధికార పార్టీకి దీటైన క్యాండిడేట్​గా ప్రజల నుంచి ఫీడ్‌‌బ్యాక్‌‌ రావడంతో రఘునందన్‌‌రావు వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపింది