సర్వశిక్ష అభియాన్ పథకం కింద కేంద్రప్రభుత్వం అందజేసే నిధులతో విద్యార్థులకు కల్పించే సౌకర్యాలకు సైతం తన పేరు పెట్టుకుంటూ నిధులన్నీ తానే సొంతంగా ఇస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం దారుణం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి.

ఒకవైపు కూడఁరం నిధులు ఇవ్వట్లేదు, సహకరించట్లేదు అని ప్రచారాలు చేస్తూ మరో వైపు కేంద్ర నిధులతోనే ప్రజలకు కానుకల రూపంలో ఓటు బ్యాంకును పెంచుకునే పని మొదలు పెట్టారని అయన విమర్శించారు.

జగన్ మారాలి , జగన్ లో మార్పు రావాలి అంటూ అయన ట్వీట్లు చేసారు. ప్రభుత్వ నిధులతో స్వంత పేపర్లను నిషేధించాలి. #జగనన్నవిద్యాదీవెన లో 60% నిధులు ఎక్కడ నుండి వచ్చాయి? గత కొద్ది రోజుల క్రితం 60% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో #జగనన్నగోరుముద్ద అనడం నిజం కాదా? కావాలంటే ఇది చదవండి అంటూ ఆధారాలు చూయిస్తూ ట్వీట్లు చేసారు.

Image

కేంద్ర ప్రభుత్వ పథకమైన సమగ్రశిక్ష అభియాన్ 2020-21 క్రింద 655.60 కోట్ల లో కేంద్రం 60% వాటా ఇవ్వగా, ఏపి ప్రభుత్వం 40% వాటా కలిపి రాష్ట్రంలోని 30 లక్షల 70 వేల 901 విద్యార్థులకు 3 జతల యూనిఫాం, పుస్తకాలు, షూస్ – సాక్సులు, బెల్ట్, బ్యాగ్ లు రాష్ట్రం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తునన్నది.

విద్యాశాఖమంత్రి సురేష్ గారు, ప్రభుత్వ పథకాలకు @ysjagan గారి పేరు వారి కుటుంబ ట్రస్ట్ నిధుల నుండి ఖర్చు పెట్టి సేవ చేస్తే అభ్యంతరం ఉండదు. 60% కేంద్ర మరియ 40% రాష్ట్ర నిధులతో నిర్వహించే పథకాలకు ఈ స్వంత డబ్బ కొట్టుకోవడానికి వెచ్చించే ఆలోచనలు విద్య ప్రమాణాల పై దృష్టి పెడితే ప్రజలు హర్షిస్తారు.

ఈ పథకానికి “జగనన్న విద్య కానుక” అనే స్టిక్కర్ విద్యార్థుల స్కూల్ బ్యాగ్ లపైన, బెల్ట్ లపైన అంటించి మరోసారి “స్టిక్కర్ సీ.ఏం” పేరుకు జగన్ గారు సార్ధకత చేసుకున్నారు. ఇది నిజమేూ కాదో సమాదానం చెప్పండి. గత బాబు ప్రభుత్వం మీద మీరు చేసిన విమర్శలు గుర్తు చేసుకుంటే గురువింద సామెత గుర్తొస్తుంది అంటూ ఎద్దేవా చేసారు విష్ణు.