చంద్రబాబు లేఖపై స్పందించి రాష్ట్ర ప్రజలకు బిజెపి,మోడీ గారికి క్షమాపణ చెప్పమని నిలదీసిన బిజెపి నేత ఆపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి
నేడు ఎందుకీ మార్పు బాబు?
మోడీకి గారిపై మరియు బిజేపి పట్ల మీ దిగజారాడు వ్యాఖలు ప్రజలు మరచిపోలేదు చంద్రబాబుగారు.
క్రింది వాఖ్యలు మీవేనా…?
“నీకు కుటుంబం,బంధాలు లేవు.మా హక్కులు కాలరాశారు.మాఅభివృద్ధిని ఒర్వేకపోతున్నారు.నీ కంటే నేను ముందే సియం,అయ్యాను.గుజరాత్ ని ఏం అభివృద్ధి చేసావు? మీరాష్ట్రం కంటే దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి? మీకు మేము బానిసలం కాదు.మీరు పబ్లిసిటీ పీఎం.మీరు పనిచేసే పీఎం కాదు. మాకు పనిచేసే పీఎం కావాలి” ఇవన్నీ సందర్భానుసారంగా 2018 మర్చి నుండి 2019 ఏప్రిల్ మధ్య నాడు మీరు మాట్లాడిన మాటలు బాబు గారు. గుర్తుఉందా?
నేటి ..మీ వాఖ్యలు..!
ఇవి తాజా లేఖలో మీరు మోడీగారికి చేసిన భజన.
“మీ సమర్ధ, శక్తివంతమైన నాయకత్వంలో దేశ భద్రత గణనీయంగా ఇనుమడించింది.
మన సాయుధ దళాలు నూతన విశ్వాసాన్నిపొందాయి.అంతర్గతంగా,ఉగ్రవాదులు మరియు ఉగ్రవాద శక్తుల నుండి వచ్చే ముప్పు తగ్గింది, దేశం వెలుపల సరిహద్దులు బలోపేతం చేయబడ్డాయి.
రాజకీయాల్లో మీరు,మీ పార్టీ అవసరానుగుణంగా భజన చేయడం మామూలే ! అవసరం తీరిన తర్వాత మీరు మాట్లాడడం మామూలే అది వెన్నెతో పెట్టిన విద్య.1998,1999 ,2004 ,2014, 2019 మీ నాయకత్వంలో మాకు చాలా రాజకీయ అనుభవం ఉంది.
-ఇప్పుడు ప్రజలకు కావాల్సింది, తక్షణ కర్తవ్యంగా మీరు చేయవలసిన పని ఏమిటంటే..!
చంద్రబాబుగారు మీరునేటి భావితరాలకు సమాదానంచెప్పాలి.
మీరు తెలిసి చేసిన పోరపాట్లు,అమరావతిని, రైతులను ,రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి రాజకీయ బలిపీఠం ఎక్కించిన విషయంలో మీరు చరిత్రలో నిలిచిపోతారు చంద్రబాబుగారు.