కబడ్డార్ కొడాలి నాని…. బీజేపీ ఫైర్ బ్రాండ్ విష్ణు వర్ధన్
Timeline

కబడ్డార్ కొడాలి నాని…. బీజేపీ ఫైర్ బ్రాండ్ విష్ణు వర్ధన్

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నానీ వ్యాఖ్యలకు నిరసనగా భాజపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి.దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు,ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసన తెలిపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.విజయవాడలో నిర్వహించిన ధర్నాలో మంత్రి కొడాలి నాని హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం దారుణమని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న ఆయన వారికి… కొడాలి నానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు.ఆదిత్యనాథ్ యోగి అని భోగులనయివారికి వారి విలువ ఏం తెలుసని విష్ణు మండిపడ్డారు. జగన్ మెప్పు కోసమే కొడాలి నాని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ప్రధాన మోదీ, యోగి ఆదిత్య పై జగన్ కి ఏ మాత్రం గౌరవం ఉన్నా తక్షణమే మంత్రివర్గం నుంచి కొడాలి నాని ని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కొడాలి నాని మత్తులో ఉన్నారు ..ఆ మత్తుని మీరే వదిలించాలి అంటూ జగన్ ని విష్ణుకుమార్ రాజు కోరారు.కొడాలి నానీ పై డిజీపి ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయాలని,చట్టం ఒకరికి ఒకలా పనిచేస్తున్నారని,డిజిపీ వెంటనే కొడాలి నానీపై కేసు నమోదు చేయాలని విష్ణుమండిపడ్డారు.అనంతరం సబ్ కలెక్టర్ కార్యాయలం వద్ద నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తున్న బిజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.