చంద్రబాబుకి, టీడీపీకి బీజేపీ విష్ణు మంచి సలహా
Timeline

చంద్రబాబుకి, టీడీపీకి బీజేపీ విష్ణు మంచి సలహా

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు వస్తున్న ఆరోపణల నుండి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడే అవకాశం లభించిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈమేరకు బుధవారం నాడు ఆయన ట్వీట్ చేశారు.

అమరావతి భూ కుంభకోణంలో చంద్రబాబుకు సంబంధం లేకుంటే సీబీఐ విచారణను స్వచ్ఛందంగా కోరితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు ఇది చక్కటి అవకాశం అన్నారు. విచారణ అనంతరం కడిగిన ముత్యంలా బయటపడొచ్చని పేర్కొన్నారు. సీబీఐ విచారణతో బాబు మీద ప్రజలకు ఉన్న అనుమానాలు తొలగిపోతాయన్నారు.

ఇంతకీ చంద్రబాబు నాయుడు విష్ణు సలహాని పాటిస్తారా ? సిబిఐ దర్యాప్తు కోరేంత ధైర్యం చంద్రబాబు చేయగలరా ?