బాలీవుడ్లో మరో కరోనా పాజిటివ్ కేసు వచ్చింది. ఈ సారి ఏకంగా అమితాబ్ బచ్చన్ దీని బారిన పడ్డాడు. ఈయన ముంబైలోని నానావతి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు.తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయనే ట్వీట్ చేసాడు.
తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఐసోలేషన్లో ఉన్నారని చెప్పాడు అమితాబ్. ఈయన మాత్రం ముంబై నానావతి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు.
తనను గత పది రోజులుగా కలిసిన వాళ్లు కూడా వెంటనే టెస్టులు చేయించుకోవాలని సూచించాడు అమితాబ్ బచ్చన్.