Breaking News :

ఎన్టీఆర్ ట్వీట్ కు.. బన్నీ రిప్లై

ఆదివారం రిలీజైన అల.. వైకుంఠపురములో చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దాదాపు రివ్యూలన్నీ డబుల్ పాజిటివ్ గా వచ్చాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సైతం అల… వైకుంఠపురములో చిత్రానికి ఫిదా అయ్యారు. కంగ్రాట్స్ బావా అంటూ తన స్పందనను ఓ ట్వీట్ రూపంలో వెలిబుచ్చారు. దీనికి బన్నీ వెంటనే స్పందించారు. బావా… థాంక్యూ వెరీ మచ్. త్వరలోనే నిన్ను కలుస్తా. నీతో మాట్లాడుతుంటే ఎంతో బాగుంటుంది అంటూ ట్విట్టర్ లో రిప్లయ్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కు, బన్నీ రిప్లయ్ కి లైకులు, రీట్వీట్లు భారీగా వస్తున్నాయి.

Read Previous

బిగ్ బ్రేకింగ్: ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి పృథ్విరాజ్‌ రాజీనామా

Read Next

నయీం మేనకోడలు మృతి