కెనడా ప్రధాని భార్యకు క‌రోనా పాజిటివ్ నిర్ధారణ
Timeline

కెనడా ప్రధాని భార్యకు క‌రోనా పాజిటివ్ నిర్ధారణ

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో భార్య సోఫీ గ్రెగోర్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇటీవలే బ్రిటన్ పర్యటనకు వెళ్లి వచ్చిన త‌న భార్య‌కు కరోనా సోకింద‌న్న విషయాన్ని స్వయంగా ప్రధాని ట్రుడో ప్రకటించారు. త‌న భార్య‌కు ఫ్లూ ల‌క్ష‌ణాలుండ‌డంతో టెస్ట్‌లు చేయించాన‌ని.. త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని తేలిందని ట్రుడో తెలిపారు. బ్రిట‌న్‌లో జ‌రిగిన‌ ఓ కార్యక్రమంలో ట్రుడో దంపతులు పాల్గొన్న అనంత‌రం సోఫీ గ్రెగోర్‌లో ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. ట్రుడోకు కరోనా లక్షణాలు లేవని నిర్ధారించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్ర‌స్తుతం త‌న భార్య‌ను ఐసోలేషన్ గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నార‌ని, ప్రస్తుతం తాను వర్క్ ఫ్రమ్ హోంకు ప్రాధాన్య‌త‌నిస్తున్నాన‌ని ట్రుడో తెలిపారు. కెనడాలో కూడా కరోనా ప్రభావం ఎక్కువగానే వుంది. ఇప్పటి వరకు వందమంది బాధితులు తేలగా ఒకరు మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published.