కార్టూన్ వార్త: సంవత్సరం పూర్తి చేసుకున్న గ్రామ వాలంటీర్లు
Timeline

కార్టూన్ వార్త: సంవత్సరం పూర్తి చేసుకున్న గ్రామ వాలంటీర్లు

వలంటీర్‌ వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ ఆకాంక్షల మేరకు గ్రామ వలంటీర్లు అద్భుతమైన సేవలందిస్తున్నారని కొనియాడారు. వలంటీర్ల మెరుగైన పనితీరును చూసి గర్విస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్‌ వ్యవస్థ ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా ట్విటర్‌ వేదికగా ఆయన స్పందించారు. ‘ఏడాది క్రితం రాష్ట్రంలో అవినీతి రహిత పాలన, లబ్దిదారుల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలు అందించే ప్రయాణాన్ని ప్రారంభించాం. ఏడాది ప్రయాణంలో మెరుగైన పనితీరు కనబర్చిన మా #APVillageWarriors కృషి పట్ల గర్వంగా ఉంది. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు చక్కగా పనిచేశారు’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.