బిగ్ న్యూస్: ట్రాన్స్ ట్రాయ్ పై సిబిఐ కేసు – నీరవ్ మోడీ కన్నా డేంజర్
Timeline

బిగ్ న్యూస్: ట్రాన్స్ ట్రాయ్ పై సిబిఐ కేసు – నీరవ్ మోడీ కన్నా డేంజర్

కెనరా బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను రూ .7926 కోట్లకు మోసం చేశారన్న ఆరోపణలతో హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌స్ట్రాయ్ (ఇండియా) లిమిటెడ్, ఆ కంపెనీ సిఎండి చెరుకూరి శ్రీధర్‌పై సిబిఐ కేసు నమోదు చేసింది. నీరవ్ మోడీ బ్యాంకులకు ఇవ్వాల్సిన దానికంటే ఇది పెద్ద మొత్తం అని సమాచారం.

ట్రాన్స్ ట్రాయ్ కేసు దర్యాప్తుకు సంబంధించి ఉదయం నుంచి మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అధికారులు పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకుని ఎగవేశారన్న ఆరోపణలపై రాయపాటి కంపెనీలపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది.  సీబీఐ అధికారులు ఈ కేసు విషయంలో గతంలో పలుసార్లు సోదాలు చేసి విలువైన సమాచారాన్ని సేకరించారు.

కంపెనీ సీఈవోగా పనిచేసిన శ్రీధర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు రాయపాటి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అతడిపై సీబీఐకి రాయపాటి కుటుంబం గతంలో ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. శ్రీధర్ ఫేక్ పాస్‌పోర్ట్‌తో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సీబీఐకి సమాచారం ఇచ్చారట. ఈ నేపథ్యంలో రాయపాటి నివాసం, కార్యాలయంతో పాటుగా శ్రీధర్ ఇళ్లల్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు చేసారు.

CBI files a case against Hyderabad based company Transstroy (India) Ltd and his CMD Cherukuri Sridhar for allegedly cheating a consortium of banks led by Canara Bank of Rs 7926 crore. This is bigger than what #NiravModi owes to the banks.

Leave a Reply

Your email address will not be published.